23, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పారా ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

Writer: Chandrika 11:46 AM, 23 అక్టోబర్, 2026
పారా ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. పోటీల నాలుగో రోజు భారత్ ఏడు స్వర్ణాలు, ఐదు రజతాలతో కలిపి మొత్తం 26 పతకాలు సాధించింది. దీంతో భారత్ ఖాతాలోని మొత్తం పతకాల సంఖ్య 88కు చేరగా, పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు అత్యధికంగా 52 పతకాలు సాధించారు. పురుషుల హైజంప్ టీ63 విభాగంలో శైలేశ్ కుమార్ 1.89 మీటర్లతో క్రీడల రికార్డు నెలకొల్పి స్వర్ణం గెలిచాడు. వరుణ్ భాటి రజతం, రాహుల్ కాంస్యం సాధించారు. 100 మీటర్ల పరుగులో విజయం సాధించిన దిలీప్ గవిత్, 400 మీటర్ల టీ47 విభాగంలోనూ 48.27 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్వర్ణాన్ని అందుకున్నాడు. మహిళల 400 మీటర్ల టీ47లో అంజనాబెన్ బూంబాడియా పసిడి సాధించగా, పురుషుల లాంగ్‌జంప్‌లో ధర్మరాజ్ సొలైరాజ్ 7.15 మీటర్ల ఆసియా రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలిచాడు. మహిళల డిస్కస్ త్రో ఎఫ్54 విభాగంలో సువర్ణ రాజ్ 15.66 మీటర్ల త్రోతో అగ్రస్థానంలో నిలిచింది.

ఆర్చరీలో శీతల్ దేవి ఒకే రోజు రెండు స్వర్ణ పతకాలు సాధించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో సింగపూర్‌కు చెందిన అలిమ్ నూర్ స్యాహిదాపై 142-139తో విజయం సాధించింది. అంతకుముందు మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో పాయల్ నాగ్, తోమన్ కుమార్, శ్యామ్‌సుందర్‌లతో కలిసి ఇండోనేసియా జట్టును 151-148తో ఓడించి పసిడి అందుకుంది. గతంలో మహిళల టీమ్ విభాగంలో రజతం గెలిచిన శీతల్‌కు ఈ క్రీడల్లో ఇది మూడో పతకం. డబ్ల్యూ1 విభాగంలో పతకం సాధించిన తొలి భారత ఆర్చర్‌గా స్వాతి గుర్తింపు పొందింది. ఫైనల్లో చైనాకు చెందిన సెన్ మెంగ్‌కన్ చేతిలో 4-6తో ఓడిపోయి రజతం దక్కించుకుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్విమ్మర్ రవికార్తీక్ పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్13 విభాగంలో కాంస్యం సాధించి తన పతకాల సంఖ్యను మూడుకు పెంచుకున్నాడు. అంతకుముందు అతడు రెండు రజతాలు గెలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన రవని వలసనైని మహిళల 400 మీటర్ల టీ11 పరుగులో కాంస్యం సాధించింది. గతంలో 1,500 మీటర్ల టీ11 విభాగంలోనూ ఆమె కాంస్యం గెలిచింది. పోటీలు మరో రెండు రోజులు కొనసాగనున్న నేపథ్యంలో భారత్ పతకాల సెంచరీపై ఆశలు పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పారా ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సెంచరీ..

పారా ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సెంచరీ..

74 ఏళ్ల వయసులోనూ పవర్‌లిఫ్టింగ్‌లో సత్తా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శంకరరావుకు రజతం

74 ఏళ్ల వయసులోనూ పవర్‌లిఫ్టింగ్‌లో సత్తా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శంకరరావుకు రజతం

న్యూజిలాండ్‌తో రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం..

న్యూజిలాండ్‌తో రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం..

ఇషాన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్?

ఇషాన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్?

వీల్‌చైర్‌కే పరిమితమైనా.. పట్టుదలతో పసిడి సాధించిన సువర్ణ రాజ్‌!

వీల్‌చైర్‌కే పరిమితమైనా.. పట్టుదలతో పసిడి సాధించిన సువర్ణ రాజ్‌!

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పీవీ సింధు జోరు..

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పీవీ సింధు జోరు..

ట్యాగ్లు
పారా ఆసియా క్రీడలుభారత్ పతకాలుశీతల్ దేవిరవికార్తీక్రవని వలసనైనిదిలీప్ గవిత్శైలేశ్ కుమార్భారత అథ్లెటిక్స్పారా ఆర్చరీపారా స్విమ్మింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
Jagan Slams Chandrababu, Alleges Democracy Is Being Undermined in Local Elections
జనరల్

Jagan Slams Chandrababu, Alleges Democracy Is Being Undermined in Local Elections

‘గరివిడి లక్ష్మి’లో నటించే అవకాశం మిస్ చేసుకున్న హీరోయిన్లు వీరే...
సినిమాలు

‘గరివిడి లక్ష్మి’లో నటించే అవకాశం మిస్ చేసుకున్న హీరోయిన్లు వీరే...

చంద్రబాబు, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు..
రాజకీయాలు

చంద్రబాబు, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు..

హైకు మూవీ రివ్యూ: సెకండాఫ్‌లో తడబడిన రొటీన్ ప్రేమకథ
రివ్యూలు

హైకు మూవీ రివ్యూ: సెకండాఫ్‌లో తడబడిన రొటీన్ ప్రేమకథ

15 గంటల విమాన ప్రయాణంలో సరైన ఆహారం అందించలేదని ఆరోపణ..
జనరల్

15 గంటల విమాన ప్రయాణంలో సరైన ఆహారం అందించలేదని ఆరోపణ..

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు

సీజేపీ నిరసన పిలుపుతో సంబంధం లేదు.. ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన నేహా బోరా
జనరల్

సీజేపీ నిరసన పిలుపుతో సంబంధం లేదు.. ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన నేహా బోరా

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కీలక భేటీ
రాజకీయాలు

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కీలక భేటీ

విమర్శలు ఎదుర్కొన్నా ఓటీటీలో టాప్‌లో నిలిచిన నాని ‘ది ప్యారడైజ్’
ఓటీటీ

విమర్శలు ఎదుర్కొన్నా ఓటీటీలో టాప్‌లో నిలిచిన నాని ‘ది ప్యారడైజ్’

గజ్జి, తామర సమస్యలతో బాధపడుతున్నారా? వైద్యులు సూచిస్తున్న ముఖ్యమైన జాగ్రత్తలివే!
ఆరోగ్యం

గజ్జి, తామర సమస్యలతో బాధపడుతున్నారా? వైద్యులు సూచిస్తున్న ముఖ్యమైన జాగ్రత్తలివే!

ఓకే ఒక జీవితం దర్శకుడితో రుక్మిణి వసంత్ కొత్త సినిమా
సినిమాలు

ఓకే ఒక జీవితం దర్శకుడితో రుక్మిణి వసంత్ కొత్త సినిమా

పారా ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సెంచరీ..
క్రీడలు

పారా ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సెంచరీ..

హైదరాబాద్ లగ్జరీ ఫ్లాట్లకు అదనపు భారం.. సెంట్రలైజ్డ్ ఏసీ కోసం లక్షల్లో ఛార్జీలు
జనరల్

హైదరాబాద్ లగ్జరీ ఫ్లాట్లకు అదనపు భారం.. సెంట్రలైజ్డ్ ఏసీ కోసం లక్షల్లో ఛార్జీలు

సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గిన వెండి ధర
బిజినెస్

సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గిన వెండి ధర

టాటా నుంచి రిలయన్స్ వరకు.. భారత వ్యాపార దిగ్గజాల విజయాల వెనుక దశాబ్దాల కృషి
బిజినెస్

టాటా నుంచి రిలయన్స్ వరకు.. భారత వ్యాపార దిగ్గజాల విజయాల వెనుక దశాబ్దాల కృషి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!