

ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-2లో మైటీ మరాఠాస్ విజేతగా నిలిచింది. విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ సారథ్యంలోని ఈ జట్టు ఆదివారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య కాకతీయ నైట్స్‌పై 6-2తో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్‌కు ముందు జరిగిన ఎలిమినేటర్-2లోనూ మైటీ మరాఠాస్ సత్తా చాటింది. ఆ మ్యాచ్‌లో పృథ్వీరాజ్ యోధాస్‌ను 5-3తో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
టోర్నీలో వ్యక్తిగత ప్రతిభ కనబరిచిన ఆర్చర్లకు కూడా పురస్కారాలు అందజేశారు. ఉత్తమ రికర్వ్ ఆర్చర్లుగా బొమ్మదేవర ధీరజ్, సంగీత ఎంపిక కాగా, ఉత్తమ కాంపౌండ్ ఆర్చర్లుగా ఫుల్లర్టన్, అలెజాండ్రా నిలిచారు. రాష్ట్ర క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఏపీఎల్ డైరెక్టర్ అనిల్ కామినేని, రాష్ట్ర ఆర్చరీ సంఘం చీఫ్ టి. రాజు విజేతలకు ట్రోఫీలు, పురస్కారాలు అందజేశారు. రెండో సీజన్‌లో మైటీ మరాఠాస్ సాధించిన ఈ విజయం జట్టుకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!