

ఐపీఎల్ 2026కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో మినీ వేలం ఈ నెల డిసెంబర్ 16న అబుదాబీలో జరగనుంది. వేలానికి అప్లై చేసిన 1,355 మంది ప్లేయర్లలో కేవలం 350 మందినే బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. మిగతా 1,005 మంది పేర్లను జాబితా నుంచి తొలగించడం సంచలనంగా మారింది. అలాగే, 35 మంది కొత్త ఆటగాళ్లను జాబితాలోకి చేర్చినట్లు బోర్డు తెలిపింది.
బీసీసీఐ ఫ్రాంచైజీలకు పంపిన మెయిల్ ప్రకారం, ఐపీఎల్ వేలం మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలుకానుంది. ప్రారంభ బిడ్డింగ్ ప్రక్రియలో క్యాప్డ్ ప్లేయర్లు వరుసగా ఈ కేటగిరీలలో వేలం వేయబడతారు:
బ్యాటర్లు → ఆల్‌రౌండర్లు → వికెట్ కీపర్-బ్యాటర్లు → పేసర్లు → స్పిన్ బౌలర్లు.
ఆ తర్వాత ఇదే క్రమంలో అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా వేలంలోకి రావచ్చు.
నమ్మకమైన సమాచార ప్రకారం, ఒక ఫ్రాంచైజీ ప్రత్యేకంగా అభ్యర్థించడంతో సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ పేరు షార్ట్ లిస్ట్‌లో చేర్చబడింది.
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డికాక్ — తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విశాఖపట్నంలో జరిగిన టీమిండియా–దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో సెంచరీతో దుమ్ములేపి ఫామ్‌లో ఉన్నాడు.
రాబోయే వేలంలో డికాక్ బేస్ ప్రైస్ రూ.1 కోటిగా నిర్ణయించారు. గత సారి అతడి ధరతో పోల్చితే 50% తగ్గింపు ఇది. అప్పటి వేలంలో కేకేఆర్ అతడిని రూ.2 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!