
గాసిప్స్

ప్రతి ఆదివారం ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ కామెడీ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఈ వారం ప్రత్యేక ఎపిసోడ్‌తో రాబోతోంది. ఈసారి ఆర్టిస్ట్‌లు సినిమాల్లోని పాపులర్ క్యారెక్టర్ల గెటప్‌లలో కనిపిస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నారు. ముఖ్యంగా, ఇంద్రజ శివగామి పాత్రలో కనిపించగా, రష్మి ‘డీజే టిల్లు’ లో రాధికగా అదరగొట్టింది. గెటప్‌లు, డైలాగులు, పెర్ఫార్మెన్స్ - అందరు కలిసి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించనున్నారు.
ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను డిసెంబర్ 7న ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో మంచి స్పందన పొందుతోంది. ఫ్యాన్స్ ఎపిసోడ్లో ఏమేమి ఆశ్చర్యాలు ఉంటాయో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.




















కామెంట్స్ (1)
శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం మళ్లీ నవ్వుల పండుగనే తెస్తోంది!