

టాలీవుడ్ ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ దసరా పండుగ సందర్భంగా కొత్త టెస్లా కారును కొనుగోలు చేశారు. ఈ సంతోషకరమైన విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన భార్య హరిణ్య రెడ్డితో కలిసి కొత్త కారు వద్ద దిగిన ఫొటోలను షేర్ చేశారు. దుర్గామాత ఆశీస్సులతో ఈ ప్రత్యేక సందర్భంలో కొత్త కారును కొనుగోలు చేసినట్లు పేర్కొంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు, నెటిజన్లు రాహుల్ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు.
మీడియా కథనాల ప్రకారం, రాహుల్ కొనుగోలు చేసిన టెస్లా కారు ధర సుమారు రూ.70 లక్షలు ఉంటుందని అంచనా. అయితే, కారు మోడల్, ఖచ్చితమైన ధరపై అధికారిక నిర్ధారణ లేదు. ఇప్పటికే రాహుల్ వద్ద మెర్సిడెస్ బెంజ్, వోల్వో వంటి లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. తాజాగా ఆయన కార్ల కలెక్షన్‌లో టెస్లా కూడా చేరింది. పండుగ వేళ కొత్త కారు కొనుగోలు చేయడంతో రాహుల్ అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!