

బిగ్‌బాస్ అంటేనే నటనతో కూడిన బాండింగ్స్ ఉంటాయని తెలిసిందే. కొందరు స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్‌లో తమ ఆటను కొనసాగిస్తారు. ఈ సీజన్లో కూడా డీమాన్ పవన్-రీతూ చౌదరిల ట్రాక్‌తో పాటు తనూజ-కళ్యాణ్ ల ట్రాక్ కూడా కొనసాగింది. అయితే, తనూజ పట్ల కళ్యాణ్ నిజంగానే కాస్త ఆసక్తి చూపుతున్నట్లు సులువుగా అర్థం అవుతుంది. కానీ, తనూజ మాత్రం తనతో ఫ్రెండ్‌గానే బంధాన్ని కొనసాగిస్తుంది. అయితే, సోమవారం జరిగిన ఎపిసోడ్లో నామినేషన్లు లేవు కాబట్టి బిగ్‌బాస్ వారికి ఒక టాస్క్ ఇచ్చాడు. తమ జర్నీ గురించి చెప్పాలంటూ ప్రతి ఒక్కరినీ బిగ్‌బాస్ అడిగాడు. ఈ క్రమంలోనే తనూజ గురించి కళ్యాణ్ చెప్పిన మాటలు కాస్త ఆసక్తిగానే ఉన్నాయి.
తనూజ, కళ్యాణ్ ల మధ్య ప్రేమ చిగురించిందని పలు యూట్యూబ్, సోషల్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కళ్యాణ్ బయటపడ్డాడు. తన జర్నీ గురించి చెప్పే క్రమంలో.. తనూజ వైపు కళ్యాణ్ చూస్తూ ఇలా అన్నాడు 'జీవితాంతం ఈమె (తనూజ) ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నాను.. కాదు, ఫ్రెండ్షిప్ను మించి అంటూ స్ట్రెయిటుగా చెప్పేశాడు. తనూజతో ఉన్న ఈ బాండ్ ఇలాగే ఉంటుంది. ఉండాలని అనుకుంటున్నాను. ఈ పర్సన్ ఏంటంటే మనతో పాటు ఆలోచించి అవతలి వాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించే గుణం తనూజలో ఉంది. అందుకే మోర్ దేన్ ఫ్రెండ్షిప్ తనూజతో ఉండాలని అనుకుంటున్నాను.' అని కళ్యాణ్ అన్నాడు. అయితే, ఆమె నుంచి కూడా సానుకూల చూపులు కనిపించాయి. కాస్త సిగ్గుతో ఆమె తలదించుకుంది.
కామనర్‌గా కళ్యాణ్ బిగ్‌బాస్‌లోకి వచ్చాడు. కానీ, తనూజ అప్పటికే సెలబ్రిటీ. సిరీయల్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అయితే, ప్రస్తుతం ఇద్దరూ సెలబ్రిటీలే. ఎవరూ తక్కువ కాదు. కొందరైతే మరో విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కళ్యాణ్ మదర్ హౌజులోకి వచ్చి వెళ్తున్నప్పుడు తనూజ ఓ చీరెను గుర్తుగా ఇచ్చింది. దీని గురించి కళ్యాణ్ కూడా తనూజను పలు ప్రశ్నలు అడిగాడు కూడా.. కానీ, ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీంతో వారిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగిపోయింది. ఎంతలా అంటే తనూజ కోసం కప్ త్యాగం చేస్తావా అని బిగ్‌బాస్ అడిగితే.. వెంటనే కళ్యాణ్ ఓప్పేసుకుంటాడేమో అనేలా తన పరిస్థితి ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!