
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ఎవరి స్ట్రాంగ్ పాయింట్స్ ఏమిటి, వీక్ పాయింట్స్ ఏమిటి అనేది ఆడియన్స్‌కే కాదు… ఇంటి సభ్యులకు కూడా ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఫినాలే దగ్గరపడుతుండడంతో ఫ్రెండ్షిప్స్ను పక్కన పెట్టి, ప్రతి ఒక్కరూ సోలో గేమ్‌పై దృష్టిపెడుతున్నారు.
తాజా ఎపిసోడ్ ప్రోమోలో, కెప్టెన్సీ టాస్క్‌కు ఎవరిని దూరం పెట్టాలి? ఎందుకు పెట్టాలి? అనే విషయాన్ని బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు చెప్పమని సూచించాడు. కెప్టెన్ అయిన తనూజ ఒక్కొక్కరు వచ్చి చెప్పమని అడిగినా ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో… దివ్య మొదటగా మాట్లాడేందుకు ముందుకొచ్చింది.
తనూజకు రెండు వారాల ఇమ్యూనిటీ ఇప్పటికే లభించిందని, అందువల్ల ఆమె మళ్లీ కెప్టెన్ అయితే మళ్లీ ఇమ్యూనిటీ వచ్చేస్తుందని… అందుకే ఈసారి ఆమెను కెప్టెన్సీ రేస్‌లోంచి తప్పించాలని దివ్య స్పష్టంగా చెప్పింది. తన రీజన్ 100% కరెక్ట్ అని కూడా చెప్పింది.
కానీ ఇది వినగానే తనూజ రియాక్ట్ అవుతూ, దివ్య బిహేవియర్‌పై కామెంట్స్ చేసింది. దీంతో దివ్య ఆగ్రహించి, “తప్పు మాటలు మాట్లాడొద్దు” అంటూ కౌంటర్ ఇచ్చింది. దీనిపై తనూజ సర్కాజంగా స్పందిస్తూ మాటలను వ్యక్తిగతంగా మార్చింది.
ఈ ప్రోమో వెలుగులోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో దుమారం రేగింది. తనూజపై నెటిజన్లు మండిపడుతూ “ఎప్పుడూ ఏడుస్తుంది”, “ఏ విషయాన్నీ యాక్సెప్ట్ చేయదు”, “పర్సనల్‌గా తీసుకుని విక్టిమ్గా నటిస్తుంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




.avif&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!