

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల రాకతో బిగ్బాస్ తెలుగు సీజన్ 10 మరింత ఆసక్తికరంగా మారింది. ఐదో వారంలో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా, మరో ఐదుగురు హౌస్లోకి అడుగుపెట్టారు. దీంతో ఆరో వారం నామినేషన్లు హోరాహోరీగా సాగాయి. సామాన్యులు, సెలబ్రిటీల మధ్య పోరు తీవ్రంగా కనిపించింది. ఈ వారం షాలిని, వర్షిణి, వంశీ, రామ్ ప్రసాద్, అమన్, రోహిత్ నామినేషన్లలో నిలిచారు. వీరికి ఆన్లైన్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది.
ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న అనధికారిక పోల్స్ ప్రకారం రోహిత్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ రెండో స్థానంలో, అమన్ మూడో స్థానంలో ఉన్నారు. వంశీ నాలుగో స్థానంలో ఉండగా, యాంకర్ వర్షిణి ఐదో స్థానంలో, షాలిని ఆరో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వర్షిణి, షాలిని డేంజర్ జోన్లో ఉన్నారు. షాలినిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నప్పటికీ, ఆమె షోకు అవసరమైన కంటెంట్ అందిస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, వర్షిణి నుంచి పెద్దగా కంటెంట్ రావడం లేదని కొందరు భావిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఆదివారం ఎపిసోడ్లో తేలనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!