

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 తాజా ఎపిసోడ్లో భావోద్వేగాలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. తొలుత టెంపర్ వంశీ, శివకుమార్ మధ్య టాస్క్ నిర్వహించారు. ఇందులో ప్లేట్, బౌల్‌ను టేబుల్‌పై ఉంచే క్రమంలో శివకుమార్ తెలివిగా ఆడి విజయం సాధించాడు. దీంతో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన వంశీ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన ప్రదర్శనపై అసంతృప్తితో కన్నీళ్లు పెట్టుకుంటూ తన చెంపలపై తానే కొట్టుకున్నాడు. ఈ పరిస్థితిని గమనించిన త్రిగుణ్ అతడి దగ్గరకు వెళ్లి ఓదార్చాడు. మరోవైపు, రోహిత్, షాలిని మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇతరులు చెప్పిన మాటలను పూర్తిగా విశ్లేషించకుండా నమ్ముతున్నావంటూ షాలినిపై రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. ఇకపై ఆమెతో మాట్లాడాలని కూడా లేదని, తన ముఖం చూపించనని ఆగ్రహంగా వ్యాఖ్యానించాడు.
ఆ తర్వాత గ్రీన్ టీమ్, వైల్డ్ ఫైర్స్ టీమ్ మధ్య మరో టాస్క్ నిర్వహించారు. గ్రీన్ టీమ్ తరఫున అమన్, ముకేశ్ పాల్గొనగా, వైల్డ్ ఫైర్స్ తరఫున ఆర్కే, దక్షి పోటీపడ్డారు. ఈ పోటీలో గ్రీన్ టీమ్ విజయం సాధించి ప్రత్యర్థి జట్టుకు షాక్ ఇచ్చింది. ఒకవైపు వంశీ భావోద్వేగానికి గురికావడం, మరోవైపు రోహిత్, షాలిని మధ్య వివాదం, ఇంకోవైపు టీమ్‌ల మధ్య పోటీతో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంటి సభ్యుల మధ్య సంబంధాలు, టాస్కుల్లో వారి ప్రదర్శనలు రాబోయే ఎపిసోడ్లలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!