

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో గొడవలు, నామినేషన్లతో పాటు వినోదం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా జబర్దస్త్ నరేష్ తనదైన హాస్యంతో హౌస్‌మేట్స్‌ను, ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. అతడి కామెడీ టైమింగ్‌ను హోస్ట్ నాగార్జున సైతం ప్రశంసించారు. తాజాగా నరేష్, దేబ్జానీ, దక్ష మధ్య జరిగిన సరదా సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. సీరియళ్లలో నటనతో గుర్తింపు తెచ్చుకున్న దేబ్జానీ తన హావభావాలతో నవ్వులు పూయించగా, నరేష్ తనదైన శైలిలో వినోదాన్ని పంచాడు.
దక్షతో నరేష్ ప్రేమలో ఉన్నాడనే తరహాలో సాగిన సన్నివేశాలు హౌస్‌లో సందడి చేశాయి. దేబ్జానీ కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తూ, ‘‘దక్షతో ట్రాక్ కోసం నన్ను వదిలేసి వెళ్లిపోతావా నరేష్?’’ అని ప్రశ్నించింది. దీనికి నరేష్ స్పందిస్తూ, ‘‘ఒక్క నిమిషం.. దేబ్జానీ సీరియల్.. రోజూ రాత్రి 9.30 నుంచి 10.30 వరకు’’ అంటూ సరదాగా బదులిచ్చాడు. అనంతరం నరేష్‌తో ‘‘ఐ లవ్యూ దక్ష’’ అని చెప్పించడంతో సన్నివేశం మరింత వినోదాత్మకంగా మారింది. దేబ్జానీ ప్రశ్నలకు సమాధానంగా నరేష్ విషం తాగినట్లు నటిస్తూ నీళ్లు తాగి కిందపడిపోయాడు. అతడి అతిశయోక్తితో కూడిన నటన, హాస్య టైమింగ్ ఈ సన్నివేశాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!