

బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని రోజుల్లో పూర్తి కావొస్తుంది.. ఈ నేపథ్యంలో టాప్ 5 కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీని ఇచ్చేలా టాస్క్ లను పెడుతున్నారు. 9వ సీజన్ గ్రాండ్ ఫినాలేకి ఇంకా నాలుగు రోజులే ఉంది. ఈ ఆదివారం ఫైనల్ జరగబోతుంది. దీంతో చివరి వారం ఆద్యంతం సరదా టాస్క్ లతో అలరిస్తున్నారు. బిగ్ బాస్ కూడా ఎంటర్టైన్లు చేసే టాస్క్ లు ఇస్తున్నారు.. బుధవారం ఎపిసోడ్ టాస్క్ లతో బాగానే ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఇమ్మూ జాతకంతో బాగానే ప్రేక్షకులను అలరించాడు.. ఇక తాజాగా గురువారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశాడు..
తనూజ జర్నీతో ఎమోషనల్
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోని టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీ వీడియోను చూపిస్తున్నాడు.. నిన్న ఇమ్మానుయేల్ జర్నీ చూపించాడు.. ఇప్పుడేమో తనూజను హౌస్ లోకి రమ్మని పిలుస్తాడు. తెరమీద మీరు పలికించిన భావాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాయి.. బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం.. మీ నటనకు ఆస్కారం లేని చోటు. ఇలాంటి కఠిన ప్రదేశంలో ఎన్నో ఒడిదుడుగులు దాటుకొని టాప్ 5 లో ఒక్కరుగా నిలిచి మీరు ఎంతటి చిచ్చరపిడుగు అన్నది చూపించారు అని బిగ్ బాస్ అంటారు.
చిన్నవాటికి మనసు నొచ్చుకొనే దూదిరంగం కథన రంగంలో విరుచుకుపడే శివంగిలాగా దూసుకుపోయే వీరత్వం.. మీ మనస్తత్వం మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నదే తనూజ పుట్ట స్వామి అని బిగ్ బాస్ అంటాడు.. హౌస్ లో తన జర్నీ ని చూసిన తనూజ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!