

కళ్యాణ్ పడాల బిగ్ బాస్ జర్నీ వీడియో ఎప్పుడెప్పుడా అని కాచుకుని కూర్చున్నారు అతని సపోర్టర్స్. ఎందుకంటే అతనికంటే ముందు డెమాన్, ఇమ్మాన్యుయేల్, తనూజ వీడియోలు వచ్చేశాయి. సో.. ఈ జర్నీ వీడియో అనేది ఓటింగ్‌ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ జర్నీ వీడియో చూసి కూడా ఓట్లు వేసేవాళ్లు ఉంటారు. పైగా మొత్తం ఈ 100 రోజుల ఆటలో అతను సాధించిన విజయాలను కీర్తిస్తూ బిగ్ బాస్ మాట్లాడే మాటలు గూస్ బంప్స్ అంతే. కాబట్టి.. కళ్యాణ్ కోసం బిగ్ బాస్ ఏం మాట్లాడాడని ఆసక్తిగా ఎదురుచూశారు.
అయితే విన్నర్ రేస్‌లో ముందున్న కళ్యాణ్ పడాల జర్నీ వీడియో కోసం అతని సపోర్టర్స్ ఎదురుచూస్తున్నారు. ఇమ్మాన్యుయేల్, తనూజ, డెమాన్ పవన్.. ఈ ముగ్గురి జర్నీ వీడియోలు వచ్చేశాయి కానీ.. కళ్యాణ్ పడాల వీడియో మాత్రం వాళ్ల తరువాత వదలడం.. ఓటింగ్‌పై కాస్త ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే.. ఈరోజుతో బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతున్నాయి కాబట్టి. అదే ఈ జర్నీ వీడియో నిన్నో మొన్నో వస్తే.. కళ్యాణ్‌కి మరింత ఓటింగ్ పెరిగేది అనడంలో సందేహం లేదు. సరే ఆల్రెడీ కళ్యాణ్ ఓటింగ్‌లో దూసుకునిపోతున్నాడు కాబట్టి.. ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా? అనేట్టుగానే ఉంది కళ్యాణ్ పడాల జర్నీ వీడియో. ఒక విన్నర్‌కి.. ఒక సైనికుడికి.. ఒక సామాన్యుడి అసామాన్యమైన ప్రతిభకి ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వాలో అదే చేశారు బిగ్ బాస్. కళ్యాణ్ పడాల గురించి బిగ్ బాస్ మాట్లాడిన మాటలకు అతను విజిల్ కొట్టడం కాదు.. చూసే ఆడియన్స్‌తోనూ విజిల్ కొట్టించేట్టుగానే ఉంది.
‘‘మీది ఒక సామాన్యుడి కథ.. కానీ సామాన్యమైన కథ కాదు. ఓనర్‌గా ఈ ఇంట్లో మొదలైన మీ ప్రయాణం. ఎన్నో కఠినమైన అగ్నిపరీక్షల్ని మీ ముందుకు తీసుకొచ్చింది. మీతో ఈ ప్రయాణం మొదలుపెట్టిన వాళ్లందరూ.. ఒక్కొక్కరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన క్షణాలు మిమ్మల్ని కృంగదీసినా కూడా మళ్లీ తేరుకున్నారు. బుద్ధి బలం, భుజబలాన్ని మించిన బలం మీ గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్కోవారం నింపుకుంటూ కెప్టెన్‌గా నిలిచారు. ఏకాగ్రత, అమాయకత్వం, పోరాటాన్ని ఎప్పుడూ వదల్లేదు. లోటుపాట్లను సరి చేసుకుని చివరి కెప్టెన్‌గా నిలవడమే కాకుండా.. మొట్టమొదటి ఫైనలిస్ట్‌గా నిలిచి.. ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు’ అంటూ కళ్యాణ్ పడాలకి బిగ్ బాస్ ఇచ్చారయ్యా ఎలివేషన్సూ.. మామూలుగా లేదు. చివర్లో కళ్యాణ్.. కొట్టిన విజిల్‌కి అయితే రీసౌండ్ మామూలుగా లేదు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!