

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ప్రవేశించిన అపూర్వ ఐదో వారంలో ఎలిమినేట్ అయింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే షోపై సంచలన ఆరోపణలు చేసింది. తనను అవమానించారని, పేర్లు పెట్టి పిలిచారని, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. ముఖ్యంగా ముఖేష్ తనను అగౌరవపరిచాడని ఆరోపించడంతో పాటు, షో నిర్వాహకులు కొందరు కంటెస్టెంట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ, మరికొందరిని అన్యాయంగా చూస్తున్నారని విమర్శించింది. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
అపూర్వ మూడో వారంలో మిథిలేశ్‌తో కలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. మిథిలేశ్ రూ.15 లక్షల సూట్‌కేస్‌ను ఎంచుకుని బయటకు వెళ్లగా, అపూర్వ మాత్రం ఆటను కొనసాగిస్తూ కెప్టెన్సీ కూడా సాధించింది. అయితే, చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటం, ఆమె ప్రవర్తనపై వచ్చిన ప్రతికూల స్పందనలు గేమ్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఐదో వారంలో జరిగిన డబుల్ ఎలిమినేషన్లో చరణ్‌తో పాటు అపూర్వ కూడా బయటకు వచ్చింది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో బిగ్‌బాస్ షో చుట్టూ మరోసారి వివాదం మొదలైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!