

అమెరికా స్థానిక ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జొహ్రాన్ మమ్దానీ విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. భారతీయ-ఉగాండా మూలాలున్న ఈ యువ నేత కేవలం 34 ఏళ్ల వయసులోనే న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికై కొత్త రికార్డ్ సృష్టించారు. ఈ ఎన్నికలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి మమ్దానీపై ప్రచారం చేయడం విశేషం. “మమ్దానీ మేయర్‌గా గెలిస్తే న్యూయార్క్‌కు కేంద్ర నిధులు పరిమితంగా కేటాయిస్తాను” అని ఆయన సోషల్ మీడియాలో హెచ్చరించారు. కానీ ఈ వ్యాఖ్యలు ప్రజల్లో ప్రతికూల ప్రభావమే చూపించాయి.
జొహ్రాన్ మమ్దానీ ప్రసిద్ధ భారతీయ సినీ దర్శకురాలు మీరా నాయర్ మరియు ఉగాండా ప్రొఫెసర్ మహమూద్ మమ్దానీ కుమారుడు. సమానత్వం, సామాజిక న్యాయం వంటి భావజాలంతో ముందుకు వచ్చిన ఆయన న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై గెలుపొందారు. తన ప్రచారంలో ఆయన ప్రజల అవసరాలపై దృష్టి సారించారు — ఉచిత సిటీ బస్సు సేవలు, అద్దె ధరల నియంత్రణ, యూనివర్సల్ చైల్డ్ స్కీమ్, 2030 నాటికి కనీస వేతనాల పెంపు వాగ్దానాలు ప్రజల్లో మంచి స్పందనను తెచ్చాయి. సంపన్నులు, కార్పొరేట్ సంస్థలపై పన్నులు పెంచి సాధారణ వర్గాలపై భారాన్ని తగ్గిస్తానన్న ఆయన హామీ పెద్ద ఎత్తున ప్రజలను ఆకట్టుకుంది.
అయితే ఆయన గెలుపు వెనుక అసలైన బలం – ట్రంప్‌కి ఎదురుగా ధైర్యంగా నిలబడి ప్రజల మద్దతు సంపాదించడం.










కామెంట్స్ (1)
Congrats Zohran Mamdani!