

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ రష్యాకు తమ భూభాగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించబోమని స్పష్టం చేశారు. అలా చేయడానికి తమకు అధికారాలు లేవని, రష్యా ఒత్తిడి చేస్తున్నా భూభాగాలను వదులుకోవద్దని పేర్కొన్నారు. జెలెన్స్కీ సోమవారం రాత్రి మీడియా ప్రతినిధులతో వాట్సప్ చాట్లో మాట్లాడుతూ, ‘‘భూభాగాల అప్పగింత హక్కు మాకు లేదు. చట్టాలు, రాజ్యాంగం, అంతర్జాతీయ చట్టాల ప్రకారం మాత్రమే వ్యవహరిస్తాం’’ అని చెప్పారు.
ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపునకు ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు జెలెన్స్కీ అంగీకారం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. రష్యాకు భూభాగాలను అప్పగించాలంటూ సూచిస్తూ, జెలెన్స్కీ సర్కారుకు సహకరించాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ ఐరోపా దేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నాలను కొనసాగిస్తూ, పోప్ లియో-14తో భేటీ అయ్యారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!