18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మార్కాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ సి. కనకదుర్గ నామినేషన్

Writer: Harika S 01:38 PM, 18 అక్టోబర్, 2026
మార్కాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ సి. కనకదుర్గ నామినేషన్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మార్కాపురంలో రాజకీయ సందడి నెలకొంది. మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సి. కనకదుర్గ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఆమె, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా కనకదుర్గ మాట్లాడుతూ, 2014, 2021 ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం తనకు ఉందని తెలిపారు. శ్రావణి ఆసుపత్రి ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నానని చెప్పారు. ప్రజాసేవే తన ప్రధాన లక్ష్యమని, వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం మద్దతుతో మరోసారి ఎన్నికల బరిలోకి దిగినట్లు పేర్కొన్నారు. మార్కాపురం పట్టణంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి చైర్మన్‌గా గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, జంకె వెంకట్‌రెడ్డి, కె.పి. కొండారెడ్డి, మైనార్టీ నాయకుడు షంషేర్ అలీ బిగ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, వెన్న హనుమాన్ రెడ్డి, ఉడుముడుల కోటిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు సలీం సహా పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి ముందు ఇనుప కంచెలు.. హౌస్ అరెస్ట్ చేసే అవకాశం?

పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి ముందు ఇనుప కంచెలు.. హౌస్ అరెస్ట్ చేసే అవకాశం?

నెల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికలకు 20 మంది నోడల్ అధికారుల నియామకం!

నెల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికలకు 20 మంది నోడల్ అధికారుల నియామకం!

ఏపీలో రాజకీయ హింసపై జగన్ ఆందోళన.

ఏపీలో రాజకీయ హింసపై జగన్ ఆందోళన.

టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది- వైసీపీ నేత సజ్జల

టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది- వైసీపీ నేత సజ్జల

గోదావరి–కావేరీ లింకుతో తెలంగాణ నీటి హక్కులకు ముప్పు- హరీశ్‌రావు

గోదావరి–కావేరీ లింకుతో తెలంగాణ నీటి హక్కులకు ముప్పు- హరీశ్‌రావు

యూపీలో మరోసారి బీజేపీదే ఆధిక్యమా? సర్వేలో ఆసక్తికర అంచనాలు

యూపీలో మరోసారి బీజేపీదే ఆధిక్యమా? సర్వేలో ఆసక్తికర అంచనాలు

ట్యాగ్లు
డాక్టర్ సి. కనకదుర్గమార్కాపురంవైఎస్సార్‌సీపీమున్సిపల్ ఎన్నికలుమున్సిపల్ చైర్మన్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక సద్దుల బతుకమ్మ
జనరల్

తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక సద్దుల బతుకమ్మ

బిగ్‌బాస్ తెలుగు 10 డే 42 ప్రోమో 2 విడుదల..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 42 ప్రోమో 2 విడుదల..

ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న? వేదిక, జట్టు బడ్జెట్, కీలక నిబంధనలివే
క్రీడలు

ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న? వేదిక, జట్టు బడ్జెట్, కీలక నిబంధనలివే

మార్కాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ సి. కనకదుర్గ నామినేషన్
రాజకీయాలు

మార్కాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ సి. కనకదుర్గ నామినేషన్

రణబాలిలో విజయ్ దేవరకొండ యాక్షన్‌పై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
సినిమాలు

రణబాలిలో విజయ్ దేవరకొండ యాక్షన్‌పై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు

సుడిగాలి సుధీర్‌కు 2014లోనే ఎంగేజ్‌మెంట్ జరిగిందా? వైరల్‌గా మారిన పాత ఫోటోలు
జనరల్

సుడిగాలి సుధీర్‌కు 2014లోనే ఎంగేజ్‌మెంట్ జరిగిందా? వైరల్‌గా మారిన పాత ఫోటోలు

రణబాలి బాక్సాఫీస్: రెండో రోజు తగ్గిన వసూళ్లు.. వీకెండ్‌పైనే విజయ్ దేవరకొండ ఆశలు
సినిమాలు

రణబాలి బాక్సాఫీస్: రెండో రోజు తగ్గిన వసూళ్లు.. వీకెండ్‌పైనే విజయ్ దేవరకొండ ఆశలు

ప్రభాస్ ‘స్పిరిట్’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా
సినిమాలు

ప్రభాస్ ‘స్పిరిట్’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా

బిగ్‌బాస్ తెలుగు 10: షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. వీడియోలు చూపించి మరీ హెచ్చరిక
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. వీడియోలు చూపించి మరీ హెచ్చరిక

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌కు బయటి సమాచారం చెప్పిన నీతూ మాస్టర్? హౌస్‌లో చర్చ
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌కు బయటి సమాచారం చెప్పిన నీతూ మాస్టర్? హౌస్‌లో చర్చ

బిగ్‌బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. షాలినీ సీక్రెట్ రూంలోకి?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. షాలినీ సీక్రెట్ రూంలోకి?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 42 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 42 ప్రోమో 1 విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!