18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైకాపా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర

Writer: Nithish 03:26 PM, 18 అక్టోబర్, 2026
వైకాపా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర

ప్రభుత్వంపై బురదజల్లే రాజకీయాలను వైకాపా నాయకులు ఇకనైనా మానుకోవాలని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హితవు పలికారు. ఓటమి భయంతోనే వైకాపా నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వీధి గూండాల మాదిరిగా వ్యవహరిస్తూ దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. వైకాపా నేతలు చేస్తున్న దౌర్జన్యాలను తమపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అలాంటి చర్యలను అడ్డుకోవడం తమకు పెద్ద కష్టమేమీ కాదని, అయితే అది తమ పద్ధతి కాదని పేర్కొన్నారు. పోలీసులు అడ్డుకుంటే వారిపైనా రాళ్లతో దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు.

ఐదు చోట్ల జరిగిన ఘటనలను చూపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అలాంటి పరిస్థితులే ఉన్నట్లు చిత్రీకరించడం సరికాదని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులను అడ్డుకోవడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి చేశామని జగన్‌ పదేపదే చెబుతున్నారని, అదే నిజమైతే ప్రజలు వైకాపాకు 11 సీట్లే ఎందుకు ఇచ్చారని వ్యాఖ్యానించారు. గతంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ను జగన్‌ వేధించారని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కమిషనర్‌ కుటుంబాన్ని బెదిరించారని ఆరోపించారు. గత స్థానిక ఎన్నికల సమయంలోనూ అరాచకాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటున్నామని, ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసే రాజకీయాలను వైకాపా మానుకోవాలని ధూళిపాళ్ల నరేంద్ర సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నామినేషన్లు వేయకుండా మా వాళ్లను అడ్డుకుంటున్నారు అంటూ వైఎస్ జగన్ ఆరోపణలు

నామినేషన్లు వేయకుండా మా వాళ్లను అడ్డుకుంటున్నారు అంటూ వైఎస్ జగన్ ఆరోపణలు

మార్కాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ సి. కనకదుర్గ నామినేషన్

మార్కాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ సి. కనకదుర్గ నామినేషన్

పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి ముందు ఇనుప కంచెలు.. హౌస్ అరెస్ట్ చేసే అవకాశం?

పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి ముందు ఇనుప కంచెలు.. హౌస్ అరెస్ట్ చేసే అవకాశం?

నెల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికలకు 20 మంది నోడల్ అధికారుల నియామకం!

నెల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికలకు 20 మంది నోడల్ అధికారుల నియామకం!

ఏపీలో రాజకీయ హింసపై జగన్ ఆందోళన.

ఏపీలో రాజకీయ హింసపై జగన్ ఆందోళన.

టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది- వైసీపీ నేత సజ్జల

టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది- వైసీపీ నేత సజ్జల

ట్యాగ్లు
ధూళిపాళ్ల నరేంద్రపొన్నూరు ఎమ్మెల్యేవైకాపాతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ రాజకీయాలుస్థానిక ఎన్నికలునామినేషన్లుఎన్నికల వివాదంజగన్ మోహన్ రెడ్డిరాజకీయ విమర్శలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దసరా పండగకు మారుతి కార్లపై భారీ ఆఫర్లు
బిజినెస్

దసరా పండగకు మారుతి కార్లపై భారీ ఆఫర్లు

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్
జనరల్

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం
జనరల్

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం

బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా.. దూసుకెళ్తున్న ‘జైలర్ 2’
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా.. దూసుకెళ్తున్న ‘జైలర్ 2’

దసరా కానుకగా ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పటి నుంచంటే?
ఓటీటీ

దసరా కానుకగా ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పటి నుంచంటే?

వైకాపా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర
రాజకీయాలు

వైకాపా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర

మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చిన మంత్రి సీతక్క
జనరల్

మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చిన మంత్రి సీతక్క

నామినేషన్లు వేయకుండా మా వాళ్లను అడ్డుకుంటున్నారు అంటూ వైఎస్ జగన్ ఆరోపణలు
రాజకీయాలు

నామినేషన్లు వేయకుండా మా వాళ్లను అడ్డుకుంటున్నారు అంటూ వైఎస్ జగన్ ఆరోపణలు

తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక సద్దుల బతుకమ్మ
జనరల్

తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక సద్దుల బతుకమ్మ

బిగ్‌బాస్ తెలుగు 10 డే 42 ప్రోమో 2 విడుదల..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 42 ప్రోమో 2 విడుదల..

ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న? వేదిక, జట్టు బడ్జెట్, కీలక నిబంధనలివే
క్రీడలు

ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న? వేదిక, జట్టు బడ్జెట్, కీలక నిబంధనలివే

మార్కాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ సి. కనకదుర్గ నామినేషన్
రాజకీయాలు

మార్కాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ సి. కనకదుర్గ నామినేషన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!