

రాబోయే తమిళనాడు ఎన్నికల్లో నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ స్థాపించిన తమిళగ వెట్ర కళగం (TVK) కీలక శక్తిగా మారేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఎన్నికల రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. టీవీకే ప్రధాన కార్యదర్శి ప్రకారం, విజయ్ నార్త్ చెన్నైలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశముంది. ఆ ప్రాంతాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పార్టీ ఆరోపిస్తోంది.
పొత్తుల విషయంలో కూడా టీవీకే స్పష్టత ఇచ్చింది. ఎన్డీయే, యూపీయే వంటి జాతీయ కూటములతో చేతులు కలపబోమని, స్వతంత్రంగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని విజయ్ ప్రకటించారు. సంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా టీవీకే ఎదుగుతుందని, ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో తమిళనాడు రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!