
సినిమాలు

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఒకవైపు దౌత్య చర్చలు కొనసాగుతుండగానే, మరోవైపు ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు వైట్ హౌస్ స్పష్టం చేసింది. అవసరమైతే ఇరాన్‌పై దాడి తప్పదని అమెరికా హెచ్చరిస్తుండగా, ఇరాన్ ప్రజల భద్రత, ప్రాంతీయ స్థిరత్వం కోసం తమ వద్ద పలు మార్గాలు ఉన్నాయని అధికారిక ప్రకటన చేసింది. ఈ పరిణామాలు పశ్చిమాసియా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఇరాన్ ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికాకు సంకేతాలు పంపింది. అయితే యుద్ధానికి వచ్చినా, చర్చలకు పిలిచినా తాము సిద్ధమేనని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, చర్చలకు ముందే కఠిన చర్యలు తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్నారు. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!