

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగింది. కోవిడ్ మహమ్మారిని సమర్థంగా నియంత్రించడంలో, అవసరమైన సంస్కరణలను అమలు చేయడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని అమెరికా ఆరోగ్య మరియు మానవ సేవల విభాగం (HHS) వెల్లడించింది. ఈ నిర్ణయంతో డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల నిధులను నిలిపివేస్తున్నట్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ సంస్థ కార్యాలయాల నుంచి యూఎస్ సిబ్బందిని వెనక్కి పిలిపించినట్లు ప్రకటించింది. అలాగే, డబ్ల్యూహెచ్‌వోకు చెందిన సాంకేతిక కమిటీలు మరియు వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా అమెరికా తప్పుకుంటున్నట్లు తెలిపింది.
అయితే భవిష్యత్తులో పరిమిత స్థాయిలో మాత్రమే డబ్ల్యూహెచ్‌వోతో కలిసి పనిచేస్తామని అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ఈ సంస్థ నుంచి వైదొలుగుతామని హెచ్చరించగా, తాజా నిర్ణయంతో ఆ హెచ్చరికలు కార్యరూపం దాల్చాయి. ఇదే సమయంలో, డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలిగే సమయానికి అమెరికా సుమారు 260 మిలియన్ డాలర్లు (రూ.2,382 కోట్లు) బాకీలు చెల్లించాల్సి ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదికలు వెల్లడించాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!