
న్యూస్

మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ మహిళల సంక్షేమానికి సంబంధించిన పలు హామీలు ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల రూ.2500 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే ప్రతి సంవత్సరం ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని తెలిపారు.
అదే విధంగా ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం ఉచితంగా ఇస్తామని విజయ్ హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్థిక చేయూతగా రూ.15,000 సహాయం కూడా అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా రేషన్ షాపుల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
తమిళనాడులో మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కూడా విజయ్ ప్రకటించారు. మహిళల భద్రత, ఆర్థిక స్థితి మెరుగుపడేలా ఈ పథకాలు అమలు చేస్తామని ఆయన తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!