
జనరల్

అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు ప్రతిపాదనలపై మళ్లీ ప్రతిష్టంభన కొనసాగుతోంది. శాశ్వత శాంతి కోసం టెహ్రాన్ పంపిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. అణ్వస్త్ర కార్యక్రమాలపై పరిమితులు విధించేందుకు ఇరాన్ అంగీకరించకపోవడమే కారణమని సమాచారం. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో ఈ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
అదే సమయంలో ఓవల్ కార్యాలయంలో మాట్లాడిన ట్రంప్, కాల్పుల విరమణ ఒప్పందం చాలా బలహీనంగా ఉందని వ్యాఖ్యానించారు. తాను ఒత్తిడికి లోనుకావడంలేదని, పూర్తి విజయానికి అమెరికా చేరుకుంటుందని అన్నారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి, తమ దేశం కేవలం చట్టబద్ధ హక్కుల కోసం మాత్రమే డిమాండ్ చేసినట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!