
సినిమాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ని కలవాలని ఉందని వ్యాఖ్యానించారు. పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్తులో ఆ సమావేశం జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇరాన్ కీలక నిర్ణయాల ప్రక్రియలో మొజ్తబా ఖమేనీ ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నారని, ముఖ్యమైన నిర్ణయాలకు ఆయన ఆమోదం ఉంటోందని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఘర్షణల తొలి దశలో మొజ్తబా ఖమేనీ గాయపడినట్లు వచ్చిన వార్తలను ప్రస్తావించిన ట్రంప్, ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు ఉన్నప్పటికీ ఇరాన్ వ్యవహారాలపై ప్రభావం కొనసాగుతోందని అన్నారు. ఇరాన్‌లో నాయకత్వ మార్పు కూడా చాలాకాలంగా కొనసాగుతున్న వారసత్వ ధోరణిలో భాగంగానే కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అలీ ఖమేనీ తర్వాత మొజ్తబా ఖమేనీ నాయకత్వం చేపట్టడం అదే క్రమానికి నిదర్శనమని ట్రంప్ పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!