

అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే వీసాల రద్దులో రికార్డు నమోదైంది. ఈ కాలంలో మొత్తం లక్ష వీసాలను అమెరికా ప్రభుత్వం రద్దు చేసినట్లు విదేశాంగశాఖ ప్రకటించింది. ఇందులో 8,000 విద్యార్థి వీసాలు, 2,500 ప్రత్యేక వీసాలు ఉన్నట్లు వెల్లడించింది. అమెరికా భద్రతా బలగాలతో తలపడిన వారితో పాటు చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారి వీసాలను రద్దు చేసి స్వదేశాలకు పంపిస్తున్నామని తెలిపింది.
వీసాల రద్దుకు ప్రధానంగా నాలుగు కారణాలను అధికారులు పేర్కొన్నారు. గడువు మించి అమెరికాలో ఉండటం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, దాడులకు పాల్పడటం, దొంగతనాలు వంటి నేరాలు చేయడం వీటిలో ఉన్నాయి. 2024 తో పోలిస్తే వీసాల రద్దు సంఖ్య 150 శాతం కంటే ఎక్కువగా పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అన్ని వీసా దరఖాస్తులపై సోషల్ మీడియా వెట్టింగ్ కూడా చేపడుతున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!