
సినిమాలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖను హై అలర్ట్‌లో ఉంచారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ చీఫ్ రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ప్రత్యేక అలర్ట్ మెసేజ్ పంపించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఎలాంటి లోపం తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగే అవకాశం ఉన్నందున, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పోలీసు అధికారులకు సూచించారు. విచారణ పూర్తయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని హెచ్చరికలు జారీ చేశారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!