
రాజకీయాలు

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బెంగళూరులోని తన నివాసంలో మంత్రులతో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో హైకమాండ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. సమావేశంలో శివకుమార్, సిద్దరామయ్య కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికార మార్పిడిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!