

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై స్పష్టత రాకముందే నామినేషన్ల పర్వం మొదలైంది. ఇవాళ కూటమికి చెందిన అభ్యర్థులు 19 నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. ఏ పార్టీకి ఏ డివిజన్ కేటాయించాలనే అంశంపై చర్చలు కొనసాగుతున్న సమయంలోనే అభ్యర్థులు నామినేషన్లు వేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. దీంతో కూటమిలో సీట్ల కేటాయింపుల వ్యవహారం మరింత వేడెక్కినట్లు కనిపిస్తోంది.
మరోవైపు, తమకు పోటీ చేసే స్థానం ఖరారు కాకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు కొందరు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు సూచించడంతో పాటు మంచి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేస్తున్నామని కొందరు అభ్యర్థులు చెబుతున్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు ఒక కొలిక్కి రాకముందే నామినేషన్లు వేయడం కూటమి పార్టీల నాయకత్వానికి సవాలుగా మారే అవకాశం ఉంది. తుది సీట్ల కేటాయింపుల తర్వాత అభ్యర్థుల వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!