
గాసిప్స్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న రోజుల్లో చేపట్టనున్న కార్యక్రమాల షెడ్యూల్ను పార్టీ వర్గాలు వెల్లడించాయి. అమెరికా పర్యటన ముగించుకుని ఆయన ఫిబ్రవరి 1న హైదరాబాద్కు చేరుకోనున్నారు. ఫిబ్రవరి 2 న మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల పై విస్తృతంగా చర్చించనున్నారు.
అనంతరం ఫిబ్రవరి 3 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొననున్నారు. ఈ ప్రచారంలో భాగంగా వివిధ జిల్లాల్లో బహిరంగ సభలను నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 3 న మిర్యాలగూడ, 4 న జగిత్యాల, 5 న చేవెళ్ల, 6 న భూపాలపల్లి, 7 న మెదక్, 8 న నిజామాబాద్లో ఎన్నికల ప్రచార సభలు జరగనున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!