
జీవితంలో అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. బీహార్ రాజకీయ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఎమ్మెల్యేగా నిలిచిన మైథిలి ఠాకూర్ కథ అదే విషయానికి ప్రత్యక్ష సాక్ష్యం.
కేవలం 25 ఏళ్ల వయసులోనే బీహార్ అసెంబ్లీకి ఎన్నికై, రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. కానీ ఈ విజయానికి దారి మాత్రం అసలు సులభం కాదు.
చిన్నప్పటి నుంచే మైథిలికి గాయని కావాలన్న కోరిక. సరిగమపా, ఇండియన్ ఐడల్ జూనియర్ వంటి పాపులర్ సింగింగ్ షోలలో పాల్గొనేందుకు ప్రయత్నించింది.
అయితే, సంగీత రంగంలో ఆమెకు వరుసగా తిరస్కరణలే ఎదురయ్యాయి. చాలా చిన్న వయసులోనే వచ్చిన ఈ నిరాశలు ఆమెను నిలువరించలేదు.
ఐనా, మైథిలీ నమ్మకం కోల్పోలేదు. సోషల్ మీడియాలో సంగీతాన్ని పంచుకుంటూ, తన ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు సాగింది. క్రమశిక్షణ, నిలకడ, కష్టపడే తీరు ఇవన్నీ చివరకు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చాయి.
కొన్ని నెలల క్రితం బీజేపీలో చేరిన మైథిలీ, అలి నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. తిరస్కరించబడిన గాయని నుండి సోషల్ మీడియా స్టార్‌గా అక్కడి నుండి బీహార్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసు ఎమ్మెల్యేగా ఎదగడం నిజంగా ప్రేరణాత్మకం.
మైథిలీ ప్రయాణం ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది: తిరస్కరణ అంటే ఓటమి కాదు… మరింత మంచి దారికి తీసుకెళ్లే మార్గం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!