

హీరో విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’ సినిమా వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత అయిన విజయ్ నటిస్తున్న ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో అడ్డంకులు ఎదుర్కొంటోందని, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సినిమా విడుదలను అడ్డుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ, “‘జననాయగన్’ సినిమాను అడ్డుకోవడం తమిళ సంస్కృతిపై దాడి చేయడమే. అధికార బలంతో తమిళ ప్రజల గొంతును నొక్కాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు, కానీ అది సాధ్యం కాదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండగా, దీనిపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ జరపనుందని సమాచారం.
రాహుల్ గాంధీ విజయ్‌కు మద్దతు తెలపడం వెనుక తమిళనాడులో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్, టీవీకే మధ్య రాజకీయ పొత్తు సంకేతాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గతంలో ‘మెర్సల్’ సినిమా వివాద సమయంలోనూ రాహుల్ గాంధీ విజయ్‌కు మద్దతుగా నిలిచారు. అలాగే ఇటీవల కరూర్ స్టాంపేడ్ ఘటన తర్వాత కూడా రాహుల్ నేరుగా విజయ్‌కు ఫోన్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!