16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం.. అవసరమైతే భూముల విక్రయం: మంత్రి పొన్నం ప్రభాకర్

Writer: Harika S 10:41 AM, 16 అక్టోబర్, 2026
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం.. అవసరమైతే భూముల విక్రయం: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఇటీవల ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన ఐక్య కూటమి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయూ (EU), టీఎంయూ (TMU), ఎన్ఎంయూ (NMU) ప్రతినిధులు మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రిని కలవగా, ఆయన వారిని అభినందించి సత్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి స్థాయిలో ఎన్నికలు ముఖ్యమని, కార్మిక సంఘాల ఎన్నికల మాదిరిగానే విద్యార్థి సంఘాల ఎన్నికలు కూడా కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు ప్రజాస్వామ్యబద్ధమైన నాయకత్వం అవసరమని చెప్పారు. తాను కూడా విద్యార్థి సంఘాల ఎన్నికల ద్వారానే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తుచేశారు.

కార్మికుల సమస్యలను తొందరపాటు నిర్ణయాలతో కాకుండా నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అధికారులు, కార్మిక సంఘాల నాయకులు సమన్వయంతో పనిచేయాలని, భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలతో పాటు సీసీఎస్ బకాయిలు, ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే ఆర్టీసీకి చెందిన విలువైన భూములను విక్రయించైనా బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, టీజీఎస్‌ఆర్టీసీ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని పేర్కొంటూ, సంస్థను బలోపేతం చేసేందుకు కార్మికులు, అధికారులు, సంఘాల నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖ, విజయనగరం మేయర్ అభ్యర్థులుగా వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణి

విశాఖ, విజయనగరం మేయర్ అభ్యర్థులుగా వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణి

బీసీ రిజర్వేషన్ల అర్హతపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత..

బీసీ రిజర్వేషన్ల అర్హతపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత..

ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం

ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం

సీఎంవోలో 15 శాతం కమీషన్ల అడ్డా –  కవిత

సీఎంవోలో 15 శాతం కమీషన్ల అడ్డా – కవిత

ఏపీలో స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు

ఏపీలో స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు

రైతు బీమా ఎక్కడికి పోయింది?.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

రైతు బీమా ఎక్కడికి పోయింది?.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

ట్యాగ్లు
పొన్నం ప్రభాకర్టీజీఎస్‌ఆర్టీసీఆర్టీసీ కార్మికులురిటైర్డ్ ఉద్యోగుల బకాయిలుసీసీఎస్ బకాయిలుతెలంగాణ రవాణా శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మందులను ఎక్కడ నిల్వ చేయాలి? వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే!
ఆరోగ్యం

మందులను ఎక్కడ నిల్వ చేయాలి? వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే!

స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్
జనరల్

స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్

జొన్న రొట్టె తింటే ఆరోగ్యానికి మంచిదా? వైద్యులు సూచిస్తున్న విషయాలివే!
ఆరోగ్యం

జొన్న రొట్టె తింటే ఆరోగ్యానికి మంచిదా? వైద్యులు సూచిస్తున్న విషయాలివే!

పుంగనూరులో ఉద్రిక్తత.. కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు
జనరల్

పుంగనూరులో ఉద్రిక్తత.. కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు

యూపీలో రాహుల్ గాంధీపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు
జనరల్

యూపీలో రాహుల్ గాంధీపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు

బిగ్‌బాస్‌ 10లో కెప్టెన్సీ టాస్క్‌.. ఫుడ్‌ విషయంలో రోహిత్‌, అమన్‌ మధ్య గొడవ!
షోస్

బిగ్‌బాస్‌ 10లో కెప్టెన్సీ టాస్క్‌.. ఫుడ్‌ విషయంలో రోహిత్‌, అమన్‌ మధ్య గొడవ!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 40 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 40 ప్రోమో 1 విడుదల

భారత బౌలింగ్‌ గాడి తప్పిందా? మళ్లీ సీనియర్లపైనే ఆశలు!
క్రీడలు

భారత బౌలింగ్‌ గాడి తప్పిందా? మళ్లీ సీనియర్లపైనే ఆశలు!

విశాఖ, విజయనగరం మేయర్ అభ్యర్థులుగా వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణి
రాజకీయాలు

విశాఖ, విజయనగరం మేయర్ అభ్యర్థులుగా వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణి

ఛేదనలో భారత బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి- సునీల్ గావస్కర్
క్రీడలు

ఛేదనలో భారత బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి- సునీల్ గావస్కర్

డీజిల్ ఎగుమతులపై పన్ను తగ్గింపు.. పెట్రోల్‌పై లెవీ పెంచిన కేంద్రం
బిజినెస్

డీజిల్ ఎగుమతులపై పన్ను తగ్గింపు.. పెట్రోల్‌పై లెవీ పెంచిన కేంద్రం

వాహనాల సామర్థ్య పరీక్షలకు ఆధునిక సాంకేతికత - మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

వాహనాల సామర్థ్య పరీక్షలకు ఆధునిక సాంకేతికత - మంత్రి పొన్నం ప్రభాకర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!