
జనరల్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరగాలంటే పారా మిలటరీ బలగాల భద్రత అవసరమని అన్నారు. ఇదే విషయాన్ని న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘జంగిల్ రాజ్’గా మార్చారని విమర్శించారు. శుక్రవారం పుంగనూరులో జరిగిన ఘటన అనంతరం పార్టీ ఎంపీ పీవీ మిథున్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు.
కూటమి పాలనలో సాగుతున్న దాడులు, అరాచకాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని జగన్ తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదని ఆరోపించారు. రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే కూటమి నేతలు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇవన్నీ వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన ఆరోపణలు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!