

బీహార్ అసెంబ్లీ ఫలితాల తరువాత NDA సర్కార్ ఫుల్ జోష్లో ఉంది. కేంద్ర BJP నాయకత్వం రెండు ముఖ్య అంశాలపై దృష్టిపెట్టింది:
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎంపిక – జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఫైనల్ చేయబోతోంది పార్టీ హైకమాండ్.
కేంద్ర కేబినెట్లో మార్పులు & రీషఫుల్ – అనుభవం, రాష్ట్ర అవసరాలు, పార్టీ వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని కొందరు మంత్రుల స్థానంలో కొత్తవారిని తీసుకునే అవకాశం ఉంది.
ప్రధాన అభ్యర్థులు ధర్మేంద్ర ప్రధాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్. పార్టీ అధికారికంగా అనుభవం, ప్రాంతీయ ప్రాతినిధ్యం, సామాజిక సమతుల్యత, నాయకత్వ నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుంటూ తుది నిర్ణయం తీసుకోబోతోంది.
BJP కొత్త జాతీయ అధ్యక్షుడు 2026లో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. అదే సమయంలో కేంద్ర కేబినెట్లో కూడా కొన్ని కీలక మార్పులు, సర్దుబాట్లు జరగవచ్చని అంచనా.
ఈ పరిణామాలు 2025–26లో BJP రాజకీయ వ్యూహాలను మరింత బలపరిచేలా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
_1771477764226.jpg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!