
జనరల్

ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. చివరి రోజైన ఈరోజు అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలలోపు రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కార్యాలయాలకు చేరుకున్న అభ్యర్థుల నామినేషన్లను అధికారులు స్వీకరించారు.
మరోవైపు, నామినేషన్లు దాఖలు చేసేందుకు తమ అభ్యర్థులను అనుమతించడం లేదంటూ వైఎస్సార్సీపీ ఫిర్యాదులు చేసింది. నామినేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైన జిల్లాల అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) మాట్లాడింది. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21 చివరి తేదీగా నిర్ణయించారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!