
ఆరోగ్యం

మహిళలపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ నాగబాబు ఘాటుగా స్పందించారు. మహిళల దుస్తులపై మాట్లాడే అర్హత ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేస్తూ, శివాజీ వ్యాఖ్యలను ఖండించారు.
కొంతమంది ఇప్పటికీ మగ అహంకారంతో ఆలోచిస్తున్నారని నాగబాబు వ్యాఖ్యానించారు. మహిళలు మోడ్రన్ దుస్తులు ధరించడం తప్పు కాదని, వారి వస్త్రధారణపై ప్రశ్నలు వేయడం సరికాదని అన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు దుస్తులే కారణమన్న భావన పూర్తిగా తప్పుదారి పట్టించేదేనని ఆయన పేర్కొన్నారు.
నేరాలకు అసలు కారణం పురుషుల క్రూరత్వం మరియు వికృత మనస్తత్వమేనని నాగబాబు అన్నారు. సమాజం మారాలంటే మహిళలను నిందించడం కాకుండా, ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!