

తెలంగాణ భవన్లో నిర్వహించిన కే. చంద్రశేఖర్ రావు జన్మదిన సంబరాల్లో కే. తారక రామారావు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన సమయంలో రాజకీయంగా బలమైన శక్తులు ఎదురు నిలిచినా, ఎలాంటి ఆర్థిక, అధికార, మాధ్యమ మద్దతు లేకపోయినా తెలంగాణకు న్యాయం చేయాలనే సంకల్పమే కేసీఆర్ను ముందుకు నడిపించిందన్నారు. ఆ దృఢ సంకల్పంతో సాగిన దీర్ఘకాల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని పేర్కొన్నారు.
ఉద్యమ నాయకత్వంతో పాటు పరిపాలనలోనూ కేసీఆర్ ప్రత్యేక గుర్తింపు సాధించారని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన నాయకుడిగా నిలిచారని తెలిపారు. ఒక సందర్భంలో అరుణ్ జైట్లీ కూడా కేసీఆర్ ఉద్యమకారుడిగానే కాక పరిపాలకుడిగానూ సమర్థుడని ప్రశంసించారని గుర్తు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తితోనే రాష్ట్రం ఏర్పడిందని, ఆ విలువలను కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!