
జనరల్

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్టేట్ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ జెండా గద్దె మోడల్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే మోడల్లో జెండా గద్దెలను నిర్మించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
మూడు ఫీట్ల ఎత్తు, రెండు ఫీట్ల వెడల్పుతో జెండా గద్దెలు నిర్మించాలని తెలిపారు. గ్రీన్ కలర్ బేస్‌పై ఎల్లో కలర్ భాగంలో బ్లూ కలర్ తెలంగాణ మ్యాప్‌తో పాటు మధ్యలో “టీఆర్ఎస్” అని ఇంగ్లీష్ అక్షరాల్లో రాయాలని సూచించారు. ఈనెల 20 నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు జెండా పండుగ నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!