

బంగ్లాదేశ్ నుంచి ప్రేరణ పొందాలన్నట్లు ఎన్‌ఎస్‌యూఐ నాయకురాలు నేహా బోరా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి తీవ్రంగా స్పందించారు. నగరంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ, భారత యువత తమ దేశం పట్ల గర్వపడాలని, ఇతర దేశాల నుంచి ప్రేరణ పొందాల్సిన అవసరం లేదని అన్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబం పట్ల గర్వపడతారని, అదే విధంగా భారతీయులు తమ దేశం, సంస్కృతి, వారసత్వాన్ని గౌరవించాలని పేర్కొన్నారు.
భారతదేశ మూలాలు స్వామి వివేకానందుడి బోధనలు, ప్రాచీన నాగరికత, ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే సిద్ధాంతంలో ఉన్నాయని విజయలక్ష్మి వివరించారు. నేహా బోరా బంగ్లాదేశ్ నుంచి ప్రేరణ పొందాలనుకుంటే అక్కడికే వెళ్లవచ్చంటూ వ్యాఖ్యానించారు. యువత రాజకీయ పార్టీలు, అజెండాలకు అతీతంగా నాయకుల వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించాలని సూచించారు. సంబంధిత వ్యాఖ్యల్లో దేశం పట్ల గర్వాన్ని చాటే ఆలోచనలు కనిపించడం లేదని ఆమె విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో దేశభక్తి, జాతీయ గుర్తింపు, ఇతర దేశాల నుంచి ప్రేరణ పొందడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!