
.webp&w=3840&q=75)
డొనాల్డ్ ట్రంప్ అంటే వివాదాలకు మరో పేరు అన్నట్లుగా మారిపోయింది. ఆయన నోరు విప్పితే వివాదం చెలరేగుతుంది, తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఒకవైపు శాంతి గురించి మాట్లాడుతూనే మరోవైపు యుద్ధ ధోరణి అవలంబించడం ఆయన రాజకీయ శైలిగా మారింది. ప్రత్యర్థులే కాదు, సన్నిహిత మిత్ర దేశాలనూ ఆయన వ్యాఖ్యలు కలవరపెడుతుంటాయి.
రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచే ట్రంప్ ప్రపంచానికి సవాళ్లు విసురుతున్నారు. వాణిజ్య యుద్ధాల ద్వారా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను ఒత్తిడిలోకి నెట్టగా, స్వదేశంలో వలసదారులపై కఠిన చర్యలతో లక్షల మందిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఏడాది పాలన పూర్తిచేసుకున్న ఈ దశలోనూ ట్రంప్ నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగానే కొనసాగుతున్నాయి. ఆధునిక రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేతగా నిలిచిన ట్రంప్, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని ఆ స్థాయిలో ప్రభావితం చేసిన నాయకుడిగా చర్చకు వస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!