

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) 15 శాతం కమీషన్ల వసూళ్లకు కేంద్రంగా మారిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రతి పనికి 15 శాతం కమీషన్ ఇవ్వాలంటూ సీఎంవో నుంచే అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఎక్స్ వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు బదులుగా దోపిడీ పాలన సాగిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అనుచరులకు ప్రజాధనాన్ని కట్టబెట్టేందుకు నిబంధనలను పక్కనపెడుతున్నారని, అర్హతలు లేని వ్యక్తులకు కూడా భారీ పనులు అప్పగిస్తున్నారని కవిత విమర్శించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో దళిత జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలపై కవిత స్పందించారు. ఎస్సై శ్రీకాంత్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సైకి సంబంధించిన భూ అక్రమాలు, సెటిల్మెంట్లపై వార్తలు రాసినందుకు జర్నలిస్టులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి, నోట్లో గుడ్డలు కుక్కి హింసించారని ఆరోపించారు. డీజీపీ వెంటనే జోక్యం చేసుకుని, ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!