

హైదరాబాద్ అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఇద్దరూ నగర అభివృద్ధికి బ్రేకులు వేస్తూ, హైదరాబాద్‌ను రాజకీయ లాభాల కోసం బలి చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
జూబ్లీహిల్స్‌లోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ అన్నారు:
మెట్రో రైలు విస్తరణ, గోదావరి జలాల మళ్లింపు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులు — ఇవన్నీ ఈ ఇద్దరు ‘బ్యాడ్ బ్రదర్స్’ అడ్డుకుంటున్నారు అని దుయ్యబట్టారు.
హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషిని గుర్తు చేస్తూ, 2004 నుంచి 2014 వరకు నగరానికి ఆధునిక రూపాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌నే అని పేర్కొన్నారు. “విమానాశ్రయం, హైటెక్ సిటీ, నాలెడ్జ్ సెంటర్, మెట్రో రైలు — ఇవన్నీ కాంగ్రెస్ పాలనలోనే వచ్చాయి. కానీ కేసీఆర్, మోదీ పాలనలో కొత్తగా నిర్మించిందేమిటి?” అని ప్రశ్నించారు. రేవంత్ మాట్లాడుతూ, “కేసీఆర్ సచివాలయం, ప్రగతి భవన్, కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం తప్ప మరేమీ చేయలేదు. వాటివల్ల ప్రజలకు ఒక ఉద్యోగమైనా వచ్చిందా? ఒక్క ఎకరాకైనా నీరందించారా?” అని నిలదీశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నా హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయిందని ఆయన మండిపడ్డారు. “ఐటీఐఆర్‌ను కాంగ్రెస్ తెచ్చింది, కానీ మోదీ–కేసీఆర్ జంట దాన్ని రద్దు చేసింది. దీంతో వేలాది ఉద్యోగావకాశాలు పోయాయి,” అని అన్నారు. హైడ్రా, ఈగిల్ ఫోర్స్లపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని ఆయన పేర్కొన్నారు. “హైడ్రా దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది. దానిని నిలిపివేయాలనే ప్రయత్నం ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకం,” అని స్పష్టం చేశారు.
డ్రగ్స్ సమస్యపై కూడా రేవంత్ తీవ్రంగా వ్యాఖ్యానించారు:
కేటీఆర్ సన్నిహితుడు కేదార్ మాదకద్రవ్యాల మోతాదుతో మృతి చెందాడు. కేటీఆర్ బావమరిది ఇంట్లో జరిగిన పార్టీలో కొకైన్ దొరికిందని నిజం కాదా? అని ప్రశ్నించారు.
మోదీ పై కూడా విమర్శలు గుప్పించిన రేవంత్ - ముస్లిం టోపీ పెట్టుకుని ప్రచారం చేసే ప్రధాని మోదీ, హిందూ మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు అన్నారు. హరీశ్‌రావుపై కూడా ఆయన దాడి చేశారు. జగ్గారెడ్డి నుంచి ఈటల రాజేందర్ వరకు అందరినీ బయటకు పంపింది హరీశ్‌రావే. చివరికి కవితను కూడా బయటకు పంపించారు, అని అన్నారు.
రేవంత్ చివరగా విజ్ఞప్తి చేశారు:
జూబ్లీహిల్స్ ఓటర్లు బుద్ధిమత్తగా ఆలోచించి, నగర అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇవ్వాలి. హైదరాబాద్‌ను డ్రగ్స్ నుంచి, అవినీతి నుంచి బయటపడదాం, అని పిలుపునిచ్చారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!