
జనరల్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కావడంతో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవగా, బీఆర్ఎస్ భవన్ వద్ద భారీగా మోహరించారు. ఈ పరిణామాలతో అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పోలీసులు, బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బాల్క సుమన్‌పై అక్రమ కేసులు పెట్టారంటూ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 326, 351, 352, 353, 355, 361-BNS సహా PDPP చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తామని న్యాయవాదులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!