

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల్లో కొత్త వ్యూహాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం, ఇరాన్‌కు రష్యా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తున్నట్లు సమాచారం. అమెరికా యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, సైనిక స్థావరాల కదలికలపై కీలక సమాచారం రష్యా నుంచి ఇరాన్‌కు చేరుతోందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ అమెరికా దళాల కదలికలను గుర్తించే సామర్థ్యం కొంత మేర తగ్గిపోయినప్పటికీ, లక్ష్యిత దాడులు కొనసాగించగలగడం ఈ సహకారంతోనే సాధ్యమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ వేల సంఖ్యలో వన్ వే అటాక్ డ్రోన్లు, వందల క్షిపణులను అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలు మరియు ఇతర లక్ష్యాలపై ప్రయోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. రష్యా ఉపగ్రహ సేవలు, శాటిలైట్ చిత్రాలు అందించడం వల్ల ఇరాన్ దాడుల సామర్థ్యం మరింత పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ మరియు రక్షణ శాఖ స్పందించేందుకు నిరాకరించాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఉక్రెయిన్ యుద్ధమే రష్యాకు ప్రధాన ప్రాధాన్యంగా ఉండటంతో పశ్చిమాసియా యుద్ధంలో ఆ దేశం నేరుగా పాల్గొనే అవకాశం తక్కువగా ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!