

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం 28 మంది ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, రాజకీయ ప్రతినిధులు నిబంధనలను ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై తగిన చర్యలు తీసుకోవడంతోపాటు, పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని పునేఠా సూచించారు. ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలను కాపాడేందుకు జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఓటర్లపై ఒత్తిళ్లు, ప్రలోభాలకు తావులేకుండా చర్యలు తీసుకుని, ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!