

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ తన 4 గంటల నిద్ర సైకిల్నే కొనసాగిస్తున్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. క్రమశిక్షణ, సమయపాలన, కష్టపడి పనిచేసే నైపుణ్యానికి చంద్రబాబు ఒక నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో సీనియర్ IAS అధికారి ఆర్.సి. సిన్హా చంద్రబాబు నాయుడు పరిపాలనా శైలిపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. “ఆయనకు అలసట అనే మాటే తెలియదు. రాత్రి 12 గంటల వరకు పని చేసి, ఉదయం 4 గంటలకు లేసేవారు. చిన్న యోగా సెషన్ తర్వాత ఉదయం 5 గంటలకల్లా వీధుల్లోకి వచ్చి పరిశుభ్రత పనులను స్వయంగా పరిశీలించేవారు. ఆయన వర్క్ డిసిప్లిన్ చూసి మొత్తం వ్యవస్థ మేల్కొనేది,” అని సిన్హా తెలిపారు.
ఈ వీడియోపై స్పందించిన నారా లోకేష్ తెలిపారు – “చంద్రబాబు గారి వర్క్ రొటీన్ ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతుంది. ఆయన రోజుకు కేవలం 4 గంటలే నిద్రపోతారు. మిగతా సమయమంతా రాష్ట్ర పరిపాలనకే అంకితం చేస్తారు” అని ట్వీట్ చేశారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (2)
Amazing dedication and discipline from Chandrababu garuu!
Discipline Goals