

ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ కామెడీ థ్రిల్లర్ మూవీ తెలుగులోకి వచ్చేసింది. ఆ సినిమానే బాంబ్. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్గా చేసింది. ఓజీ నటుడు అర్జున్ దాస్ హీరోగా చేశాడు. 7 రేటింగ్ ఉన్న బాంబ్ ఏకంగా నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆవేంటో లుక్కేద్దాం.
ఆహా తమిళం, సింప్లీ సౌత్, షార్ట్‌ఫ్లిక్స్ మూడింట్లో బాంబ్ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, వీటిలో కేవలం తమిళ భాషలో మాత్రమే బాంబ్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చింది. రీసెంట్గా తెలుగులో కూడా బాంబ్ ఓటీటీ ప్రీమియర్ అయింది. అది కూడా మరో ఓటీటీలో బాంబ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ ఓటీటీనే అమెజాన్ ప్రైమ్ వీడియో. అక్టోబర్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతోపాటు హిందీ భాషలో బాంబ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు బాంబ్ సినిమాను అమెజాన్ ప్రైమ్, ఆహా తమిళ్, సింప్లీ సౌత్, షార్ట్‌ఫ్లిక్స్ వంటి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో వీక్షించవచ్చు.










కామెంట్స్ (1)
Excited to watch Bomb in Telugu!