

హాలీవుడ్ సినిమా ‘సూపర్ మ్యాన్’ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తోంది. తెలుగులో కూడా ఉచితంగానే చూసే అవకాశం రానుంది. డీసీ యూనివర్స్‌లోని ఈ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. 1984 నుంచి ఈ జానర్ మూవీస్ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి రిలీజైన లేటెస్ట్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.
ఈ ఏడాది విడుదలైన ‘సూపర్ మ్యాన్’ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది, కానీ భారత్‌లో అందుబాటులో లేదు. అయితే, తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్ ఈ సినిమాపై అప్డేట్ ప్రకటించింది. భారత్‌లో డిసెంబరు 11 నుంచి సూపర్ మ్యాన్ స్ట్రీమింగ్కు రానుందని పేర్కొంది. ఇంగ్లీష్‌తో పాటు, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 6 వేల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలో భారతీయ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
కథ విషయానికి వస్తే జహ్రాన్పూర్పై బొరేవియా తన సైన్యంతో దాడి చేయగా దాన్ని సూపర్ మ్యాన్ అడ్డుకుంటాడు. టెక్నాలజీతో ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్ సూపర్ మ్యాన్‌పై వ్యతిరేకత వచ్చేలా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని మాయమాటలు చెబుతాడు. వీడియోలు చూపిస్తాడు. దీంతో సూపర్ మ్యాన్‌పై అందరికీ నమ్మకం పోతుంది. మరి అలాంటి పరిస్థితి నుంచి అందరూ తనని నమ్మేలా ఎలా చేశాడు? ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!