

1989లో విడుదలైన నాగార్జున, అమల, రఘువరన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్యాంపస్ డ్రామా శివ భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సాధించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తన నూతన శైలితో, సరికొత్త టెక్నిక్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. నేటికీ ఇది కల్ట్ క్లాసిక్‌గా అభిమానుల హృదయాల్లో నిలిచింది.
కొద్ది రోజుల క్రితం ఈ ఐకానిక్ చిత్రాన్ని 4K రీమాస్టర్ చేసి ప్రపంచవ్యాప్తంగా మళ్లీ థియేటర్లలో విడుదల చేశారు. ప్రేక్షకులు అపూర్వమైన స్పందనతో దాన్ని మరోసారి విజయవంతం చేశారు. ఇప్పుడు థియేటర్ల తర్వాత శివ 4K త్వరలోనే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. IFFI 2025 సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, రీమాస్టర్ చేసిన ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా మరింత విస్తృతంగా ప్రేక్షకులను చేరేలా చేసే పని జరుగుతోందని తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీత మహర్షి ఇళయరాజా అపూర్వమైన స్వరాలను అందించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!