
సినిమాలు
%20(1).png&w=3840&q=75)
సంక్రాంతి సినిమాలు ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానున్నాయో స్పష్టత వచ్చింది. దీంతో థియేటర్లకు వెళ్లలేని సగటు ప్రేక్షకుడికి కొంత ఊరట లభించినట్టైంది. జియో హాట్‌స్టార్‌లో ది రాజా సాబ్ స్ట్రీమింగ్ కానుండగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో జన నాయకుడు, నారీ నారీ నడుమ మురారి విడుదల కానున్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్ లో అనగనగా ఒక రాజు, పరాశక్తి ప్రేక్షకులను అలరించనున్నాయి.
అదే విధంగా జీ5లో మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రదర్శించనున్నారు. సాధారణంగా సంక్రాంతి సినిమాలను థియేటర్లలోనే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. అయితే అన్ని చిత్రాలను పెద్ద తెరపై చూడలేని వారు, ఓటీటీల్లో వీటిని ఆస్వాదించే అవకాశం దక్కింది. థియేటర్లలో ఈ సినిమాలు ఎంతగా మురిపిస్తాయో, ఓటీటీల్లో ఎంత స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాయో చూడాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!