

ప్రముఖ నటి మీనా మరియు నటుడు వినీత్ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ “రోస్లిన్” (Roslin) ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్‌ను దర్శకుడు సుమేష్ నందకుమార్ తెరకెక్కించారు. ఆయన ‘దృశ్యం’ చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడంతో, ఈ సిరీస్‌పై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
“రోస్లిన్”ఈ రోజు జియోహాట్‌స్టార్‌లో విడుదలైంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ మరియు బెంగాళీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. టైటిల్ రోల్లో నటించిన సంజన దిపు, మలయాళ హిట్ చిత్రం “మూతోన్” ద్వారా మంచి గుర్తింపు పొందిన యువ నటి.
వినీత్ చాలా రోజుల తర్వాత వెబ్ సిరీస్‌లో కనిపిస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీనా, వినీత్ నటన, కథలో ఉన్న సస్పెన్స్ అంశాలు ఈ సిరీస్‌కి ప్రధాన ఆకర్షణగా మారాయి.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!